ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (12:53 IST)

దేవుడు కూడా ఈ కుళ్లు రాజకీయాలను బాగు చేయలేడు... మహేష్ బాబు ఆ పనిచేస్తాడా?

సినీ దర్శకుడు కొరటాల శివ ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికర ట్వీట్లు చేశాడు. తద్వారా శివ వార్తల్లోకి వచ్చేశాడు. ప్రస్తుత రాజకీయాలు కుళ్లిపోయాయని, దేవుడు కూడా ఈ కుళ్లు రాజకీయాలను బాగు చేయలేడని కొరటాల శివ ట్వ

సినీ దర్శకుడు కొరటాల శివ ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికర ట్వీట్లు చేశాడు. తద్వారా శివ వార్తల్లోకి వచ్చేశాడు. ప్రస్తుత రాజకీయాలు కుళ్లిపోయాయని, దేవుడు కూడా ఈ కుళ్లు రాజకీయాలను బాగు చేయలేడని కొరటాల శివ ట్వీట్ చేశాడు. మనం మాత్రమే దాన్ని సరైన దారిలోకి తీసుకురావాలని కొరటాల అన్నారు.

కొరటాల ప్రస్తుతం మహేష్‌బాబుతో రాజకీయ నేపథ్యంతో కూడిన 'భరత్ అనే నేను' అనే సినిమా చేస్తున్న నేపథ్యంలో.. రాజకీయాలపై ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలు కొరటాల శివ అభిప్రాయం కాదని, భరత్ అనే నేను సినిమా మూవీ డైలాగ్‌ని ట్వీట్ చేశాడని నెటిజన్లు అంటున్నారు. మరికొందరైతే ప్రమోషన్‌లో భాగంగానే ఇదంతా చేస్తున్నాడా అన్నాడు. 
 
కాగా మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలతో సూపర్ సినిమాలను తన ఖాతాలా వేసుకున్న కొరటాల.. రాజకీయ నేపథ్యంలో మహేష్ బాబుతో సినిమా చేయడం అంచనాలను పెంచేసింది. ఇటీవల టాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్‌పై కొరటాల స్పందించారు. సమాజంలో డ్రగ్స్ కన్నా ప్రమాదకరమైన అవినీతి, అక్రమాలపై కూడా ప్రభుత్వాలు ప్రత్యేకంగా సిట్ బృందాలని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపిస్తే చాలా బాగుంటుందని ట్వీట్ చేశారు. 
 
అనినీతిపరులపై సిట్ దర్యాప్తు అంటూ కొరటాల చేసిన ప్రతిపాదనకు ఆన్‌లైన్‌లో నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజకీయాలపై కొరటాల చేసిన ట్వీటును బట్టి చూస్తే.. మహేష్ బాబును సీఎంగా చూపి.. ఏకంగా ఆయన్నే రాజకీయాల్లో తెచ్చేందుకు ప్లానేదైనా చేస్తున్నారా.. అంటూ చర్చ సాగుతోంది. అందుకే కుళ్లు రాజకీయాలను మహేష్ బాబు దారిలోకి తెస్తాడా అనేది వేచి చూడాల్సిందే.