గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 మే 2020 (17:05 IST)

రాజమౌళి 'రామాయణం'లో రాముడుగా మహేష్... ఇలా ఉంటాడేమో?! (video)

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి 'బాహుబలి' తర్వాత "ఆర్ఆర్ఆర్" మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు జక్కన్న ప్రకటించారు. అయితే, రాజామౌళి చిత్రంలో మహేష్ బాబు పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఒక వేళ రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్‌లో రామాయణం మూవీ చేస్తే, అందులో మహేష్ బాబు రాముడుగా ఎలా ఉంటాడన్న అంశంపై మహేష అభిమానుల్లో ఒకరు ఓ డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ అయింది. ఇందులో మహేష్ బాబు రాముడిగా కనపడుతున్నాడు. చేతిలో బాణం పట్టుకుని, కూల్‌గా మహేశ్ బాబు ఉన్నాడు.
 
కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్‌ విధించడంతో షూటింగులు లేకపోవడంతో ప్రస్తుతం మహేశ్ బాబు ఇంట్లోనే ఈ ఖాళీ సమయాన్ని తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన పిల్లలతో తీసుకున్న ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అభిమానులను అలరించాయి. 
 
'ఆర్ఆర్ఆర్‌' సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి తన తర్వాతి సినిమాను మహేశ్ బాబుతో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాలో మహేశ్ బాబు పాత్రపై ఆసక్తి నెలకొంది. ఒకవేళ మహేశ్ బాబుతో రాజమౌళి 'రామాయణం' సినిమా చేస్తే అందులో మహేశ్ ఎలా ఉంటాడన్న విషయాన్ని ఊహిస్తూ ఓ అభిమాని ఈ పోస్టర్‌ను రూపొందించాడు.