శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 26 జూన్ 2018 (14:46 IST)

25వ సినిమా కోసం సెంటిమెంట్ ఫాలో అవుతోన్న మ‌హేష్.. ఏంటది?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న 25వ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లితో చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. అల్ల‌రి న‌రేష్ కీ

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న 25వ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లితో చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌ను పోషిస్తుండ‌డం విశేషం. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ... సంక్రాంతికి ఎన్టీఆర్ బ‌యోపిక్, రామ్ చ‌ర‌ణ్ - బోయ‌పాటి సినిమాలు ఉండ‌డంతో స‌మ్మ‌ర్లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట‌.
 
స‌మ్మ‌ర్‌లో వ‌చ్చిన మ‌హేష్ సినిమాలు దాదాపు స‌క్స‌స్ సాధించాయి. పోకిరి, భ‌ర‌త్ అనే నేను స‌మ్మ‌ర్‌లోనే రిలీజ్ అయ్యాయి. అందుచేత సమ్మ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రో విష‌యం ఏంటంటే... మ‌హేష్ న‌టించిన పోకిరి సినిమాలో అత‌ని పేరు కృష్ణ మ‌నోహార్. త‌న తండ్రి పేరును ఆ సినిమాలోనే పెట్టుకున్నారు. ఆ సినిమా ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది. అందుచేత సెంటిమెంట్ ప్ర‌కారం ఈ సినిమాలో మ‌హేష్ క్యారెక్ట‌ర్‌కి కృష్ణ అనే పేరు పెట్టార‌ట‌. మ‌రి... ఈ సెంటిమెంట్ ఎంతవ‌ర‌కు క‌లిసొస్తుందో తెలియాలంటే స‌మ్మ‌ర్ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.