మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : సోమవారం, 22 జనవరి 2018 (11:48 IST)

''నా నువ్వే'' కోసం తమన్నా కసరత్తులు.. గాయాలు కూడా అయ్యాయట..

''నా నువ్వే'' సినిమా కోసం తమన్నా కసరత్తులు చేస్తోంది. కల్యాణ్‌రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా రేడియో జాకీగా కనిపిస్తోంది. ఇ

''నా నువ్వే'' సినిమా కోసం తమన్నా కసరత్తులు చేస్తోంది. కల్యాణ్‌రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా రేడియో జాకీగా కనిపిస్తోంది. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో మనం చూడని పాటని ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించారు. ఈ పాట సినిమాకి పెద్ద హైలైట్ అవుతుందని టాక్ వస్తోంది. 
 
ఈ పాట కోసం తమన్నా టాంగో అనే కొత్త డాన్స్‌ని నేర్చుకుంది. ఈ డాన్స్ ఎంతో నేర్పుతో కూడిన పాట కావడంతో నేర్చుకోవడం చాలా కష్టమని తమన్నా అంటోంది. ఈ డాన్స్‌కి సంబంధించి శిక్షణ తీసుకుంటున్న సమయంలో తమన్నాకి గాయాలు కూడా అయ్యాయట. ఈ డాన్స్ పర్‌ఫెక్ట్‌గా చెయ్యడంలో డాన్స్‌మాస్టర్ బృంద ఎంతగానో సహకరించారని తమన్నా చెప్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.