శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2017 (11:27 IST)

తమ్ముడు దుమ్ము దులిపావ్.. జూనియర్‌తో కళ్యాణ్ రామ్.. వంద కొట్టావ్!

జై లవకుశ సినిమాతో జూనియర్ ఎన్ టిఆర్ క్రేజ్ పెరగడమే కాదు తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త రికార్డును సాధించింది. జూనియర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా వారంరోజుల్లో వందకోట్లను దాటేసింది. కళ్యాణ్‌ రామ్ నిర

జై లవకుశ సినిమాతో జూనియర్ ఎన్ టిఆర్ క్రేజ్ పెరగడమే కాదు తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త రికార్డును సాధించింది. జూనియర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా వారంరోజుల్లో వందకోట్లను దాటేసింది. కళ్యాణ్‌ రామ్ నిర్మాతగా చేసిన సినిమాల్లో ఇదే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా. అలా ఇలా కాదు ప్రపంచ వ్యాప్తంగా రూ.105కోట్లకు పైగా లాభాన్ని తెచ్చిపెట్టింది. దీంతో సినిమా యూనిట్ ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి.
 
సినిమా భారీ హిట్ తరువాత కళ్యాణ్‌ రామ్ జూనియర్ ఎన్‌టిఆర్‌ను కలిశారు. గతంలో ఉన్న రికార్డులను దుమ్ము దులిపాయ్ తమ్ముడూ అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గతంలో జనతా గ్యారేజ్ కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది గానీ జై లవకుశ అంతకు రెండు రెట్లు మించిపోయింది. వారం తరువాత కూడా సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి.