శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 1 నవంబరు 2018 (18:17 IST)

చిన్మయి భర్తకు నాగార్జున‌ షాక్... నచ్చలేదన్నాడు...?

అందాల రాక్ష‌సి సినిమాతో ఆక‌ట్టుకుని న‌టుడుగా మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ చి.ల‌.సౌ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన విష‌యం తెలిసిందే. ఇతడు గాయని చిన్మయి భర్త కూడా. ఇకపోతే చి.ల.సౌ సినిమాతో ఆశించిన స్థాయిలో క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ సాధించ‌క‌పోయినా.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు మాత్రం అందుకున్నాడు. రాహుల్ ర‌వీంద్ర‌న్ క‌థ‌లో చూపించిన కొత్త‌దనం నాగార్జున‌కు న‌చ్చి త‌న కోసం ఓ స్ర్కిప్ట్ రెడీ చేయ‌మ‌ని బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. 
 
అయితే.. ఇటీవ‌ల నాగార్జున‌కు క‌థ చెప్పాడ‌ట‌. క‌థ విని నాగార్జున ఈ క‌థ నాకు సెట్ కాదు అని చెప్పేసాడ‌ట‌. అయితే.. ఈ క‌థ యంగ్ హీరోల‌కు బాగుంటుంది. అఖిల్‌కి సెట్ అవుతుంది. అందుచేత అఖిల్‌కి ఈ క‌థ చెప్పమన్నార‌ట నాగ్. అఖిల్ ప్ర‌స్తుతం మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా చేస్తున్నాడు. ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. మ‌రి.. రాహుల్ ర‌వీంద్ర‌న్‌కు అఖిల్ ఎప్పుడు టైమ్ ఇస్తాడో..? తీరా క‌థ విన్న త‌ర్వాత చేస్తానంటాడో.. లేక చేయ‌నంటాడో చూడాలి.