శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 30 అక్టోబరు 2018 (22:15 IST)

నాగార్జున కోసం స్క్రిప్ట్ రెడీ చేశాడట.. కానీ...?

కార్తికేయ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై.. తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్స‌స్ సాధించిన యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి. ఆ త‌ర్వాత ప్రేమ‌మ్ సినిమాతో మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకున్న చందు ఇప్పుడు మూడ‌వ విజ‌యం కోసం స‌వ్య‌సాచి అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. నాగ‌ చైత‌న్య‌తో చందు తెర‌కెక్కించిన ఈ భారీ చిత్రం న‌వంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సినిమాపై చైతు అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు.
 
ఇదిలా ఉంటే... చందు చేతిలో 3 సినిమాలు ఉన్నాయ‌ట‌. ఆ మూడు చిత్రాలు ఏంటంటే.. నాగార్జున కోసం స్ర్కిప్ట్ రెడీ చేసాడ‌ట‌. కార్తికేయ 2 స్టోరీ ఐడియా ఉంది. 15 నిమిషాల స్టోరీ ఉంది మిగ‌తాది రెడీ చేయాలి. ఇంకోటి చాణ‌క్య అనే స్టోరీ ఉంది. ఈ మూడింటిలో ఏ క‌థ‌తో సినిమా తీస్తానో చెప్ప‌లేను. స‌వ్య‌సాచి రిలీజ్ త‌ర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఎనౌన్స్ చేస్తానంటున్నాడు. మ‌రి.. చందు త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో ఉంటుందో తెలియాలంటే స‌వ్య‌సాచి రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.