గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By tj
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (14:13 IST)

అలాంటి క్యారెక్టర్‌ను అదరగొడతానంటున్న నాని...!

యువ నటుల్లో నానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. లవర్ బాయ్‌గానీ, మాస్ క్యారెక్టర్‌గానీ ఎలాంటి క్యారెక్టరన్నయినా అవలీలగా నాని చేయగలడని సినీపరిశ్రమ మొత్తానికి తెలుసు. అందుకు ఎలాంటి రెకమెండేషన్ లేకున్నా

యువ నటుల్లో నానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. లవర్ బాయ్‌గానీ, మాస్ క్యారెక్టర్‌గానీ ఎలాంటి క్యారెక్టరన్నయినా అవలీలగా నాని చేయగలడని సినీపరిశ్రమ మొత్తానికి తెలుసు. అందుకు ఎలాంటి రెకమెండేషన్ లేకున్నా సొంత టాలెంట్‌తోనే నాని తెలుగు సినీపరిశ్రమను ఈదుకుంటూ వస్తున్నాడు. అయితే నానికి ఈ మధ్య కాలంలో ద్విపాత్రాభినయం క్యారెక్టర్లే ఎక్కువగా వస్తున్నాయి. గతంలో రెండు సినిమాల్లో నాని నటించారు. అందులో 'జెండాపై కపిరాజు', 'జెంటిల్‌మేన్'లు ఉన్నాయి. రెండు సినిమాలు బాగానే ఆడాయి. దీంతో నాని ద్విపాత్రాభినయంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు.
 
నాని కోరుకుంటున్నట్లుగానే ఆ క్యారెక్టర్లు ఆయనకు వస్తున్నాయట. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని త్వరలోనే ఒక సినిమా చేయబోతున్నాడట. డ్యుమెల్ రోల్ అంటే చాలామంది హీరో దూరంగా ఉంటారు. కొంతమంది అస్సలు నటించరు. ఎందుకంటే గతంలో డ్యుయెల్ రోల్ సినిమాలు చాలా ఫెయిలయ్యాయి. కానీ నాని మాత్రం డ్యుయెల్ రోల్ అంటే ఎగబడి మరీ షూటింగ్‌కు వెళ్ళిపోతున్నారట. ఇప్పటికే వరుస హిట్లతో జోష్‌లో ఉన్న నాని ఈ సినిమాతో మరింత పేరు ప్రఖ్యాతలు వస్తుందని భావిస్తున్నారట.