నయనతార పెళ్లి...! ఎప్పుడు?

మనీల| Last Updated: బుధవారం, 9 అక్టోబరు 2019 (12:26 IST)
ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల్లో కూడా న‌య‌న‌తార పెళ్లిపై వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. న‌య‌న్ పెళ్లి టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లవుతున్నా కూడా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్‌‌గా చ‌క్రం తిప్పుతుంది. ఇంకా చెప్పాలంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ ఈమే.

నయన్ కొందరితో ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్లి విఫలమైంది. కాని ఇప్పుడు ఈమె పెళ్లిపై కూడా క్లారిటీ వ‌చ్చేస్తుంది. త్వ‌ర‌లోనే విఘ్నేష్ శివ‌న్‌తో నిశ్చితార్థానికి సిద్ధ‌మ‌వుతుంది న‌య‌న‌తార‌.

దర్శకుడు విఘ్నేశ్ శివన్‌‌‌తో కథానాయిక నయనతార ప్రేమ ముదిరి పెళ్లి పీటలు ఎక్కనుంది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట,
డిసెంబరులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇరు కుటుంబాల అంగీకారంతోనే త్వ‌ర‌లోనే ఈ జంట అఫీషియ‌ల్ జోడీ కావ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తుంది. పైగా, వీరి వివాహం ఇండియాలో కాకుండా విదేశాల్లో జరుగుతుందని కోలీవుడ్ సమాచారం.దీనిపై మరింత చదవండి :