నేను అరుళ్ సరసన నటించట్లేదు.. హన్సిక
శరవణా స్టోర్స్ అధిపతి అరుళ్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సినీ నటి హన్సికా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే శరవణా స్టోర్స్‌కి సంబంధించిన యాడ్స్‌లో అరుళ్ స్వయంగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల తమన్నా, హన్సికతో కలిసి రూపొందించిన ఓ యాడ్‌లోనూ అరుళ్ దర్శనమిచ్చాడు. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా అరుళ్‌పై గతంలోనూ పలు విమర్శలు వచ్చినా...అతను ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
అయితే అరుళ్ హీరోగా తెరకెక్కనున్న ఓ కొత్త సినిమాలో తాను జోడిగా నటించనున్నట్లు వెలువడిన కథనాలపై సినీ నటి హన్సికా మోట్వానీ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ పొడక్షన్ పనులు పూర్తయినట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వినికిడి.
ఈ నేపథ్యంలో అరుళ్ సరసన నటించేందుకు హన్సిక మోత్వానీ ఆమోదం తెలిపినట్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై క్లారిటీ ఇచ్చిన హన్సిన...తాను అరుణ్ సరసన నటించనున్నట్లు మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టంచేసింది.