ఆదివారం, 10 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2016 (12:21 IST)

రూ.2కోట్ల పారితోషికం.. సగం బ్లాక్, సగం వైట్.. నయనతార ఇంటిపై ఐటీ దాడులు తప్పవా?

హీరోలకు ధీటుగా దక్షిణాది అగ్రతార నయనతార పారితోషికం డిమాండ్ చేస్తుందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. నయన తన వయస్సుతో పాటు రెమ్యూనరేషన్‌ కూడా పెంచుకుంటూ పోతోందని.. తాజాగా ఓ సినిమా కోసం రూ.2కోట్లు డిమా

హీరోలకు ధీటుగా దక్షిణాది అగ్రతార నయనతార పారితోషికం డిమాండ్ చేస్తుందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. నయన తన వయస్సుతో పాటు రెమ్యూనరేషన్‌ కూడా పెంచుకుంటూ పోతోందని.. తాజాగా ఓ సినిమా కోసం రూ.2కోట్లు డిమాండ్ చేసిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రభుదేవాతో బ్రేకప్‌కు తర్వాత నయనతార తొమ్మిది సినిమాలు చేసింది. వాటిలో 8 సినిమాలు హిట్ కావడంతో పారితోషికాన్ని నయన బాగా పెంచేసింది. 
 
దీంతో కోలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోయిన్‌ ఎవరూ అంటే అందరూ నయనతార అని టక్కున చెప్పేస్తారు. అయితే ఈ పారితోషికంలో సగం, వైట్‌గానూ, సగం బ్లాక్‌గానూ తీసుకోవడం నయనకు అలవాటు. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్లాక్‌ అంతా వైట్‌ చేసి ఇవ్వమని నిర్మాతలకు నయన ఆర్డరు వేసిందట. 
 
అసలే ఎక్కువ ఇస్తున్నామని బాధపడుతున్నవారికి నయన ఆర్డర్‌ చేయడం పుండుమీద కారం చల్లినట్లుండటంతో.. నయన దగ్గర బాగా డబ్బున్న విషయాన్ని ఏసీబీకి నిర్మాతలు చెప్పేశారని.. ఇందులో భాగంగా నయనతార ఇంటిపై త్వరలో ఐటీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.