1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 14 సెప్టెంబరు 2016 (17:09 IST)

ఘోస్ట్ రైటర్‌తో పవన్ కళ్యాణ్ 'నేను-మనం-జనం' రెడీ అవుతుందా...?

సినిమా కథలు చాలా ఘోస్ట్ రైటర్లు రాసినవే ఉంటుంటాయి. ఐతే ఆ విషయం కాస్త ఆలస్యంగా వెలుగుచూస్తుంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ పార్టీ జనసేన గురించి, రాబోయే కాలంలో జనసేన పార్టీ చేపట్టే కార్యకలాపాల గురించి, ఇంకా రాజకీయాల్లోకి తను ఎందుకు రావాల్సి వచ

సినిమా కథలు చాలా ఘోస్ట్ రైటర్లు రాసినవే ఉంటుంటాయి. ఐతే ఆ విషయం కాస్త ఆలస్యంగా వెలుగుచూస్తుంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ పార్టీ జనసేన గురించి, రాబోయే కాలంలో జనసేన పార్టీ చేపట్టే కార్యకలాపాల గురించి, ఇంకా రాజకీయాల్లోకి తను ఎందుకు రావాల్సి వచ్చిందన్న సంగతీ... ఇలా అనేక విషయాల గురించి నేను-మనం-జనం పేరుతో ఓ పుస్తకంలో చర్చించాలనుకుంటున్నట్లు తెలియజేశారు. 
 
ఐతే ఈ పుస్తకాన్ని నిజంగా పవన్ కళ్యాణే రాస్తున్నారా...? లేదంటే ఇజం టైపులో మరో రచయితతో రాయించేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే గతంలో ఇజం పుస్తకాన్ని రాజు రవితేజ్ రాశారు. ఆ పుస్తకంలో ఆయన పేరు కూడా ఉంది. ఈ నేపధ్యంలో నేను-మనం-జనం పుస్తకాన్ని కూడా ఎవరైనా ఘోస్ట్ రచయితతో రాయిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో వస్తున్న సమచారం ప్రకారం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి పనిచేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టరుతో పవన్ కళ్యాణ్ ఈ పని కానించేస్తున్నారని చెప్పుకుంటున్నారు. తను చెప్పదలుచుకున్నది పవన్ చెపుతుంటే అతడు అవన్నీ విని పుస్తకంలో రాస్తారట. పవన్ మాటలను ఓ క్రమపద్ధతిలో పెట్టేసి పుస్తకంలో చేర్చుతారని సమాచారం. మరి ఇందులో నిజమెంత ఉందో పుస్తకం బయటకు వచ్చాక కానీ తెలీదు మరి.