మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 జనవరి 2017 (06:58 IST)

తమ్ముళ్ల బాగోగుల్ని కాంక్షించే ఓ అన్నయ్య త్యాగం.. పవన్ "కాటమరాయుడు" కథ ఇదే...

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం "కాటమరాయుడు". ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చ

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం "కాటమరాయుడు". ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే అభిమానులను ఆలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కథ లీక్ అయింది. ఆ కథేంటంటే...
 
తమ్ముళ్ల బాగోగుల్ని కాంక్షిస్తూ ఓ అన్నయ్య ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు? తను ప్రేమించిన యువతి కుటుంబానికి ఎలా అండగా నిలిచాడు? ప్రజలు మెచ్చే నాయకుడిగా అందరి మనసుల్ని ఎలా గెలిచాడు? అనే ఇతివృత్తంతో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌పై ఈ చిత్ర కథ సాగుతుందట. ఇందులో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
 
ఈ చిత్ర తొలి టీజర్‌ను ఈ నెల 26న విడుదలచేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న పవర్‌పుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. కుటుంబ బంధాలతో పాటు వినోదం, సెంటిమెంట్, యాక్షన్ అంశాలకు ప్రాధాన్యముంటుందని తెలిపారు. 
 
ఫ్యాక్షన్ నేతగా పవన్‌కల్యాణ్ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. ఆయనపై చిత్రీకరించిన పోరాట ఘట్టాలు రొమాంచితంగా ఉంటాయి. ఈ నెల 16 నుంచి ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. ఉగాది కానుకగా మార్చి 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు.