పవన్ కళ్యాణ్‌ను కదిలించిన పొట్టోడు...
పొట్టివాడు గట్టివాడు అంటారు. ఇప్పుడు తెలుగు కమేడియన్ సప్తగిరి గురించి చెప్పాలి. కమేడియన్‌గా ఒకేసారి పెద్ద రేంజ్‌లోకి వెళ్ళిన ఆయన ఏకంగా హీరోగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా చేసేస్తున్నాడు. మరి ఆ సినిమ
పొట్టివాడు గట్టివాడు అంటారు. ఇప్పుడు తెలుగు కమేడియన్ సప్తగిరి గురించి చెప్పాలి. కమేడియన్‌గా ఒకేసారి పెద్ద రేంజ్‌లోకి వెళ్ళిన ఆయన ఏకంగా హీరోగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా చేసేస్తున్నాడు. మరి ఆ సినిమా ఆడియోకు పవన్‌ను ఎందుకు వస్తున్నట్లు? మెగా కుటుంబంలోని హీరోల ఫంక్షన్లకు పవన్ రావాలని ఎదురుచూస్తుంటే.. ఎందుకు రారు.. కేవలం ఒక కమేడియన్ ఫంక్షన్‌కు ఎందుకు వచ్చాడనేది?
కామన్‌మేన్‌కు పెద్దగా అర్థంకాకపోయినా.. అది సప్తగిరి టెక్నిక్ అని తెలుస్తోంది. సప్తగిరి నటిస్తున్న సినిమా పేరు సప్తగిరి ఎక్స్‌ప్రెస్. కానీ అసలు దానికి 'కాటమరాయుడు' అని ముందుగా రిజిష్టర్ చేసుకున్నాడు. సరిగ్గా ఆ టైమ్‌లో పవన్ కళ్యాణ్ తను చేయబోయే సినిమాకు ఈ టైటిల్ నచ్చడంతో దీన్ని కావాలని మేనేజర్ ద్వారా అడిగించాడు. అందుకు సప్తగిరి చిన్న కండిషన్ పెట్టాడు. టైటిల్ ఇస్తాను.
కానీ నా ఆడియోకు పవన్‌సార్! వస్తేచాలు అనేది. ఇది తెలిసిన పవన్.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మామూలుగా అయితే.. టైటిల్‌ను అడిగితే కొందరు డబ్బుతో ముడిపెడతారు. కానీ తనమీద అభిమానంతో తన అభిమానిగా సప్తగిరి అడగడంతో వెంటనే పవన్ అంగీకరించాడు. ఇంకేముంది.. కొడితే గారెల బట్టులో సప్తగిరి పడ్డాడు. లక్షలు పెట్టినా రాని పబ్లిసిటీ.. సప్తగిరికి వచ్చేసింది. అది కలిసిరావడమంటే.. మరి సప్తగిరి పొట్టివాడైనా.. తెలివిగలవాడన్నమాట.