శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2023 (09:33 IST)

కండల వీరుడితో బుట్టబొమ్మ ప్రేమాయణం.. అసలు సంగతేంటి?

Pooja Hegde
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో పూజా హెగ్డే ప్రేమాయణం నడుపుతుందనే ప్రచారం బిటౌన్‌లో జోరుగా సాగుతోంది. దీనిపై బుట్టబొమ్మ స్పందించింది. తనపై ఇలాంటి వార్తలను తాను చదువుతానే కానీ, పెద్దగా పట్టించుకోనని వెల్లడించింది. 
 
ప్రస్తుతం తాను సింగిల్ గానే వున్నానని, తనకు సింగిల్‌గా వుండటం ఇష్టమని చెప్పింది. ప్రస్తుతం తాను సినీ కెరీర్‌‌పై దృష్టి పెట్టానని వెల్లడించింది. మరెన్నో సినిమాల్లో నటించాలనేదే తన టార్గెట్ అంటూ చెప్పుకొచ్చింది. 
 
ఇలాంటి ప్రచారాలపై స్పందించే సమయం కూడా తనకు లేదని వెల్లడించింది. ఇలాంటి వార్తలను అస్సలు పట్టించుకోనని వెల్లడించింది.