శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (10:52 IST)

యూరప్‌ వెళుతున్న ప్రభాస్‌ కుటుంబీకులు! పుట్టినరోజు అక్కడే

Prabhas
Prabhas
రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం యూరప్‌లో వున్నారు. మోకాలు సర్జరీ కోసం ఆయన వెళ్ళిన విషయం తెలిసిందే. ఆపరేషన్‌ పూర్తయి ప్రస్తుతం అక్కడే విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం. కాగా, ప్రభాస్‌ పుట్టినరోజు అక్టోబర్‌ 23. సహజంగా అందరికీ హైదరాబాద్‌లోనే పుట్టినరోజు వేడుక చేసి ఆనందపరిచేవారు. అయితే తాజా సమాచారం ప్రకారం బర్త్‌డే వేడు కోసం ప్రభాస్‌ కుటుంబీకులు, సన్నిహితులు యూరప్‌ వెల్లేందుకు వీసా పనిలో వున్నారు. వారందరి సమక్షంలో బర్త్‌డే జరగనుంది.
 
విశేషేమంటే, యూరప్‌లోని తెలుగువారిని కూడా అసోసియేషన్‌ ద్వారా బర్త్‌డే వేడకకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాన్‌ వరల్డ్‌ హీరోగా ఎదిగిన ప్రభాస్‌కు ఇది మరింత ప్లస్‌ కానుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ కె. సినిమా చేస్తున్న ప్రభాస్‌, మారుతీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కూడా రన్నింగ్‌లో వుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను యూరప్‌లోనే విడుదలచేయనున్నట్లు సమాచారం.