ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

ప్రభాస్‌ హీరాగో లోకేష్ కనకరాజ్ చివరి చిత్రం?

lokesh kanakaraj
పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం ఆయన విజయ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం లియో. ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని ఆయన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ, ప్రభాస్‌తో సినిమా ఉండొచ్చనే సంకేతం ఇచ్చారు. పైగా, అది తన చివరి చిత్రం కావొచ్చని తెలిపారు. ఓ విధంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో ప్రభాస్ సినిమానే ఎండ్ కార్డ్ అవుతుందనుకొవచ్చు.
 
దీంతో ఈ విషయం తెలిసిన ప్రబాస్ అభిమానుల ఆనందం ఇప్పుడు అంతా ఇంతా కాదు. 'ఖైదీ' మూవీలో కార్తీతోనే అల్టిమేట్ రేంజ్ హీరోయిజం చూపించి, 'మాస్టర్', 'విక్రమ్'లతో అమాంతం స్టార్ డైరెక్టర్‌గా లోకేష్ ఎదిగిన వైనం అందరికీ తెలిసిందే. అయితే ప్రభాస్ లోకేష్‌ల కలయిక కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పట్టనుంది. 
 
లోకేష్ కనగరాజ్ 'లియో' విడుదలయ్యాక ఐదారు నెలలు రజినీకాంత్ 171 స్క్రిప్ట్ మీద పని చేయబోతున్నాడు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎంతలేదన్నా 2024 చివరికి వస్తుంది. ఆ తర్వాత 'ఖైదీ 2' తీస్తానని చెప్పాడు. ఆపై 'విక్రమ్ 2' కోసం కమల్ హాసన్ రెడీ అవుతారు. దీనికి కథ ఉంది కానీ ఫుల్ వెర్షన్ డెవలప్ చేయాలి. వీటితో పాటు రోలెక్స్‌ని సోలో క్యారెక్టర్‌గా మార్చి ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. 
 
వీటన్నింటిని లోకేష్ యునివర్స్ పేరుతో ముడిపెడతాడు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేసరికి 2028 వస్తుంది. మరొపక్క ప్రభాస్ "కల్కి 2", "సలార్ 2", మారుతీ సినిమా, సందీప్ వంగా స్పిరిట్ ఫినిష్ చేసుకుని లోకేష్ కోసం సమయాన్ని కేటాయించాలి. మధ్యలో జరిగే ఆలస్యాలు, వాయిదాలను లెక్కెసుకుని చూస్తే 2030 సంవత్సరం వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి ప్రభాస్ లోకేష్‌ల సినిమాకు చాలా సమయం ఉందని అభిమానుల ఫిక్స్ అయిపొవటమే.