శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 9 సెప్టెంబరు 2020 (22:15 IST)

సురేష్‌ బాబు నిర్ణయం సరైనదేనా..?

ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు.. కొరియన్ మూవీ మిస్ గ్రానీ తెలుగులో ఓ బేబీ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. కొరియన్ కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులు నచ్చేలా రూపొందించారు. నందినీ రెడ్డి కరెక్ట్‌గా తెరకెక్కించడంతో ఓ బేబీగా సమంత ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందుకే బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందించింది.
 
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా... ఓవర్సీస్‌లో సైతం మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే... నిర్మాత సురేష్ బాబు ఇప్పుడు మరో రెండు కొరియన్ మూవీస్ రీమేక్‌లని తెరపైకి తీసుకురాబోయే ప్రయత్నాల్లో వున్నారు. సురేష్ బాబు సొంతం చేసుకున్న కొరియన్ మూవీస్ మిడ్ నైట్ రన్నర్స్.. డ్యాన్సింగ్ క్వీన్.
 
ఈ రెండు చిత్రాల్లో మిడ్ నైట్ రన్నర్స్ చిత్రాన్ని సుధీర్ వర్మ రీమేక్ చేయనున్నారు. ఇందులోని కీలక పాత్రల్లో రెజీనా- నివేదా థామస్ నటించబోతున్నారు. ఇదిలా వుంటే డ్యాన్సింగ్ క్వీన్ చిత్రం కోసం యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు పొందిన శ్రీవాస్ ని సంప్రదించారట. శ్రీవాస్ ఈ రీమేక్ తెరకెక్కించడానికి ఓకే చెప్పాడని తెలిసింది.
 
లౌక్యం- సౌఖ్యం- డిక్టేటర్- సాక్ష్యం వంటి యాక్షన్ చిత్రాల్ని రూపొందించిన శ్రీవాస్‌ని సురేష్ బాబు డ్యాన్సింగ్ క్వీన్ రీమేక్ కి ఎంచుకోవడం నిజంగా ఆశ్చర్యమే. డ్యాన్సింగ్ క్వీన్ ఇదొక రొమాంటిక్ ఎంటర్ టైనర్. మరి.. ఇలాంటి రొమాంటిక్ మూవీకి యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ శ్రీవాస్ ని ఎంచుకోవడం సరైనదేనా..? కాదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.