ఆదివారం, 3 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (11:32 IST)

ఆమెపై కన్నేసిన ఆర్జీవీ.. SAAREE శ్రీలక్ష్మి ఎవరు?

Ram Gopal Varma
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తాజాగా ఆర్జీవీ ఓ యువతిపై ప్రశంసలు కురిపించారు. శివ, సత్య, సత్య 2, రక్త చరిత్ర వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 
 
తన మనసుకు ఏది అనిపిస్తే ఆర్జీవీ దాన్ని బయటపెడతాడు. ఆయన చెప్పినంత ధీటైన సమాధానాలు ఎవరూ చెప్పలేరు. ట్విట్టర్‌లో సంచలన వ్యాఖ్యలు చేసి సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాల్లో అమ్మాయిలను పొగిడే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
అంతేగాకుండా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అరియానా గ్లోరీని ఆర్జీవీ మెచ్చుకోవడంతో ఆమె తెగ పాపులర్ అయింది. అలాగే, బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానాతో రామ్ గోపాల్ వర్మ బయటకు వెళ్లినప్పుడు ఆమె వీడియో వైరల్ అయ్యింది. 
 
ఇక డేంజరస్ సినిమాతోనే కాకుండా అప్సర రాణి హాట్ ఫోటోస్‌ని తరచుగా షేర్ చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. అలాంటి రామ్ గోపాల్ వర్మ కన్ను ఇప్పుడు ఓ అమ్మాయిపై పడింది. కేరళకు చెందిన శ్రీలక్ష్మి సతీష్ ఆర్జీవీ హృదయాన్ని దోచుకున్న క్యూటీ. 
 
సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఆకర్షిస్తోంది. అందులో చీర కట్టుకుని రీలు కట్టింది. ఆమె చీరకట్టు వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ శ్రీలక్ష్మి అందాన్ని ప్రశంసించారు. ఇంకా RGV తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చాడు. తాను SAAREE అనే చిత్రం చేయడానికి ప్రేరణ పొందాను అని చెప్పాడు. తన తదుపరి సినిమా ఆమెతోనేనని వెల్లడించాడు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RGV (@rgvzoomin)