గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2023 (12:08 IST)

కల్కి 2898Kలో ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ

Rajamouli
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898K. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌‌లో భారీ తారాగణం పాల్గొంటోంది. దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌‌లతో పాటు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, అలాగే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కల్కిలో నటించనున్నారు.
 
ఈ మేరకు విషయాన్ని యూనిట్ కన్ఫామ్ చేసింది. ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కల్కిలో అతిధి పాత్రలో కనిపించనున్నారని తెలిపింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, లోఫర్ లేడీ దిశా పటాని కీలక పాత్ర పోషిస్తోంది.