కాంతారా 2లో మోహన్ లాల్ నటిస్తున్నారా?
నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. బ్లాక్‌బస్టర్ చిత్రం కాంతారాలో అసాధారణమైన నటనతో అందరి మనస్సుల్లో నిలిచాడు. ప్రస్తుతం కాంతారా సీక్వెల్ ప్రాజెక్ట్‌లో నిమగ్నమై ఉన్నాడు.
తన అభిమానులకు గొప్ప సినిమా అనుభవాన్ని అందించడానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నాడు.ఇటీవల, రిషబ్, అతని భార్య ప్రగతి శెట్టి మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను కలవడం విశేషం.
ఈ ఫోటోలను రిషబ్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు.. కాంతారాలో మోహన్ లాల్ నటిస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు.