గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (17:03 IST)

'తొలిప్రేమ' దర్శకుడితో మెగాహీరో?

'తొలిప్రేమ'... పవన్ కళ్యాణ్, భూమిక నటించిన చిత్రం. సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అలాంటి చిత్రానికి దర్శకుడు ఏ కరుణాకరన్. ఇపుడు ఈయన మళ్లీ తెరపై

'తొలిప్రేమ'... పవన్ కళ్యాణ్, భూమిక నటించిన చిత్రం. సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అలాంటి చిత్రానికి దర్శకుడు ఏ కరుణాకరన్. ఇపుడు ఈయన మళ్లీ తెరపైకి వచ్చారు. ఓ మెగా ఫ్యామిలీ హీరో నటించే చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
 
ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్‌ని కలిసి రొమాంటిక్ లవ్ స్టోరీ వినిపించాడు. కథ తేజూకి కనెక్ట్ కాగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ చిత్రాన్ని కె.ఎస్.రామారావు నిర్మించనున్నట్టు సమాచారం. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "జవాన్" చిత్రంతో బిజీగా ఉండగా, ఈ మూవీ తర్వాత వినాయక్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడట. మరి 'జవాన్' తర్వాత తేజూ వినాయక్‌తో చేస్తాడో లేదంటో కరుణాకరన్‌తో చేస్తాడో అనే దానిపై క్లారిటీ లేదు.