శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (18:52 IST)

దిల్ రాజుకు నో చెప్పిన సాయిపల్లవి

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయిపల్లవి తాజాగా నానితో మిడిల్ క్లాస్ అబ్బాయిలో నటించింది. ఈ సినిమాకు తర్వాత దిల్ రాజు నిర్మించే శ్రీనివాస కల్యాణంలో నటించేందుకు నో చెప్పిందట. మిడిల్ క్ల

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయిపల్లవి తాజాగా నానితో మిడిల్ క్లాస్ అబ్బాయిలో నటించింది. ఈ సినిమాకు తర్వాత దిల్ రాజు నిర్మించే శ్రీనివాస కల్యాణంలో నటించేందుకు నో చెప్పిందట. మిడిల్ క్లాస్ అబ్బాయి కూడా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రం ఈ నెల 21వ తేదీన రిలీజ్ కానుంది. అయితే దిల్ రాజు- సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ''శ్రీనివాస కల్యాణం'' సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. 
 
ఈ కథకి హీరోగా నితిన్‌ను ఎంపిక చేసుకున్న ఆయన, కథానాయికగా మళ్లీ సాయిపల్లవినే అడిగారట. కానీ స్క్రిప్ట్ విన్న సాయిపల్లవి.. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోవడంతో సారీ సార్ తాను చేయలేనని చెప్పేసిందట. దీనిని పాత్రల ఎంపిక విషయంలో సాయిపల్లవి ఎంత జాగ్రత్తగా ఉంటుందని దిల్ రాజు బాగా తెలుసుకున్నారట. దీంతో పూజా హెగ్డేను ఈ పాత్ర కోసం దిల్ రాజు తీసుకున్నారని తెలిసింది.