లైగర్ లో విజయదేవరకొండతో సారా కూడా జాయిన్
Vijay devarkond, sarah, charmi
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా `లైగర్`. ఇప్పటికే విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది. కాగా, మంగళవారంనాడు నిర్మాత చార్మి తన సోషల్‌మీడియాలో మరో హీరోయిన్‌ను కూడా చూపిస్తూ ఫొటోను పోస్ట్ చేసింది. ఇందులో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మీలతో పాటు సారా అలీ ఖాన్, కరణ్ జోహార్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఉన్నారు.
ఇక కొద్దిరోజులో మరిన్ని వివరాలు తెలియజేస్తానని అంటోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఇందులో సారా నాయికగా నటిస్తోందా! లేదా ఓ ప్రత్యేక గీతంలో నర్తించనున్నదా! అనే అనుమానం కూడా కలిగించేలా చేసింది చార్మి. అందుకే త్వరలో దీని గురించి వివరాలు తెలియజేస్తానంటోంది.