ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (20:47 IST)

40 దాటిన హీరోలతో చేయనంటున్న హీరోయిన్.. ఎవరు?

ఈమధ్య కాలంలో వయస్సు పైబడిన హీరోలను పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నారు హీరోయిన్లు. సినిమా అవకాశాలు దక్కకపోయినా ఫర్వాలేదు. మనస్సు చంపుకుని వయస్సు దాటిన హీరోయిన్లతో చేయడం సాధ్యం కాదని తెగేసి చెప్పేస్తున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు.. చాలామందే హీరోయిన్లు ఉన్నార

ఈమధ్య కాలంలో వయస్సు పైబడిన హీరోలను పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నారు హీరోయిన్లు. సినిమా అవకాశాలు దక్కకపోయినా ఫర్వాలేదు. మనస్సు చంపుకుని వయస్సు దాటిన హీరోయిన్లతో చేయడం సాధ్యం కాదని తెగేసి చెప్పేస్తున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు.. చాలామందే హీరోయిన్లు ఉన్నారు. ప్రస్తుతం ఆ జాబితాలో చేరింది హీరోయిన్ సీరాత్ కపూర్.
 
ఈ పేరు వింటే ఏదో కొత్తగా అనిపిస్తుందిగా.. లేదండి.. రన్ రన్ రాజా సినిమాలో హీరోయిన్‌గా గుర్తుపట్టారు. మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో సమంత పక్కన స్నేహితురాలిగా నటించింది ఆమే సీరాత్ కపూర్. తాజాగా ఈ హీరోయిన్ టచ్ చేసి చూడు సినిమాలో నటించింది. సినిమా యావరేజ్ టాక్‌తో వెళుతోంది. అయితే సీరాత్ కపూర్‌కు మాత్రం ఇప్పుడు పెద్దగా అవకాశాలు మాత్రం లేదు. 
 
తెలుగు సినీ పరిశ్రమలో 40 ఏళ్లు దాటిన హీరోలతో చేస్తే అవకాశాలు రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీరాత్ కపూర్ ఒక సినిమా చేయడం.. అది పెద్దగా ఆడకపోవడంతో ఇక ఆమె కూడా ఒక షరతు పెట్టేసిందట. 40 దాటిన హీరోలతో అస్సలు నటించనని భీష్మించుకు కూర్చుందట. ఇలా ఒక్కొక్క హీరోయిన్ ఎవరికి వారు ప్రకటనలు చేసుకుంటూ పోతే ఇక 40 యేళ్ళు దాటిన హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టమవుతుందని తెలుగు సినీపరిశ్రమలోని వారు చెవులు కొరుక్కుంటున్నారు.