మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (18:17 IST)

హీరోయిన్‌గా నాకు విలువలేదు.. మాటలతో హింసిస్తోంది.. నిత్యామీనన్

nithya menon
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సాయి పల్లవి, నిత్యా మీనన్, నివేదా థామస్ వంటి విభిన్న కథానాయికలు ఉన్నారు. వారు కమర్షియల్ ట్రెండ్‌లకు దూరంగా ఉన్నారు. ఇందులో నిత్యా మీనన్ టాప్‌లో వుంది. ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.  
 
సింగర్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన ఈమె కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథా పాత్రల్లో కనిపిస్తుంది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా వుంటుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేస్తున్న నిత్యా మీనన్ తాజాగా కాస్త జోరు తగ్గించింది. 
 
ఇటీవల కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఓటీటీలో ప్రసారమై మంచి స్పందన వచ్చింది.
 
ఈ వెబ్ మూవీకి సంబంధించి నిత్యా మీనన్ కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పింది. ఆమె పెళ్లిపై ఒత్తిడి తీసుకురాకుండా వారు ఎల్లప్పుడూ చాలా మద్దతుగా ఉన్నారు.
 
 
 
తన ఇంట్లోనే కాదు.. తనపై ఒత్తిడి తెచ్చే వారెవరూ లేరని, అయితే తన అమ్మమ్మ తనను హీరోయిన్‌గా చూడడం లేదని చెప్పింది. అమ్మమ్మ తన విలువ ఇవ్వకుండా మాటలతో హింసిస్తోందని నిత్య చెప్పింది.