సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (21:25 IST)

పెళ్లిపై నిత్యామీనన్ ఆసక్తికర కామెంట్స్.. ఏమన్నదో తెలుసా?

nithya menon
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ పెళ్లిపై ఆసక్తికర కామెంట్లు చేసింది. తాను సాంప్రదాయాలకు విలువ ఇస్తానని.. పెళ్లంటే ఒక సోషల్ ఫైనాన్షియల్ సెటప్ అనీ అలాంటి వారితోనే పెళ్లి ముడిపడి వుందని చెప్పుకొచ్చింది. తనకు అలాంటి పెళ్లి వద్దని వెల్లడించింది. 
 
ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది. సోషల్ సెక్యూరిటీ మించిన అంశమేదైనా వుంటే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని స్పష్టం చేసింది. 
 
ఇక దక్షిణాది స్టార్ హీరోలకు జోడీగా నిత్యా మీనన్ నటించింది. రీసెంట్‌గా తెలుగులో భీమ్లా నాయక్‌తో మరో హిట్‌ను తన అకౌంట్‌లో వేసుకుంది. అలాగే కోలీవుడ్‌లో ధనుష్‌కు జోడీగా తిరు మూవీలో నటించి అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా నిత్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. 
 
ఆ ఫోటోలో, నిత్యామీనన్ 'బేబీ బంప్' కనిపిస్తుంది. నీతా బేబీ బంప్ ఫోటోలు చూసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఎందుకంటే నిత్యకు ఇంకా పెళ్లి కాలేదు. దీంతో నిత్యా గర్భం దాల్చినట్లు ప్రకటించడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు.
 
దీనిపై నిత్యామీనన్ క్లారిటీ ఇచ్చేసింది. త్వరలో ‘వండర్ ఉమెన్’ సినిమా ద్వారా అభిమానులను కలవనున్నట్లు తెలిపింది. సినిమాలోని తన పాత్ర ప్రెగ్నెంట్ ఉమెన్ అంటూ క్లారిటీ ఇచ్చింది.