1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Sneha Makes A Tollywood Comeback

కాకాతో మళ్లీ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోన్న స్నేహ?

Sneha
Sneha
తొలి వలపు, గౌరి, హనుమాన్ జంక్షన్, శ్రీ రామదాసు వంటి తెలుగు చిత్రాలలో నటించిన నటి స్నేహ, కాకా సినిమాతో టాలీవుడ్‌లోకి తిరిగి వస్తున్నారు. చిరంజీవి గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్న ఈ భారీ చిత్రంలో స్నేహ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ఘనంగా విడుదల కానుంది. ఈ సినిమాలో స్నేహ చిరంజీవి భార్య పాత్రలో కనిపించనున్నారని సమాచారం. చిత్ర బృందం త్వరలోనే ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించనుంది. 
 
చిరంజీవితో కలిసి నటించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న స్నేహకు ఇది నిజంగా ఒక కల సాకారం కానుంది. ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తె అమ్ములు పాప పాత్రను అనస్వార రాజన్ పోషిస్తున్నారు. 
 
నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన లభించింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆడవాళ్లు ఎప్పుడూ గ్రేట్, మరి మగాళ్లు జిందాబాద్ అంటూ రాబోతోన్న చిత్రం