ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 8 మార్చి 2017 (20:01 IST)

సుచిత్ర లీక్స్... సుచిత్రకు ట్విట్టర్ మేనియా.... విదేశాల్లో ట్రీట్మెంట్...?

కొంతమంది అనుకోకుండా మానసికంగా దెబ్బతింటారు. బాగానే వున్నట్లు కనిపిస్తారు కానీ వారు వ్యవహరించే తీరు సరిగా వుండదు. మానసిక వైద్యులు చెప్పే మాటలను బట్టి... కొందరు ఏదో ఒక బలమైన సంఘటన వల్ల మానసికంగా దెబ్బతిని ప్రత్యేకించి కొందరిని లక్ష్యం చేసుకుంటారు. ఇక వ

కొంతమంది అనుకోకుండా మానసికంగా దెబ్బతింటారు. బాగానే వున్నట్లు కనిపిస్తారు కానీ వారు వ్యవహరించే తీరు సరిగా వుండదు. మానసిక వైద్యులు చెప్పే మాటలను బట్టి... కొందరు ఏదో ఒక బలమైన సంఘటన వల్ల మానసికంగా దెబ్బతిని ప్రత్యేకించి కొందరిని లక్ష్యం చేసుకుంటారు. ఇక వారిపై తమకు తోచిన దాడి మొదలుపెడతారు. ఇంకొందరు... నదీ ప్రవారం చూస్తే అందులో దూకేస్తానేమోనంటూ బ్రిడ్జిని గట్టిగా పట్టుకుని నడుస్తుంటారు. 
 
మరికొందరు, రైల్వే స్టేషన్లోనే కూర్చుని వుంటారు కానీ, రైలు వస్తున్నప్పుడు ట్రాక్ పైకి దుముకేస్తానేమోనన్న భయంతో స్టేషన్ ప్లాట్ ఫారమ్ పై నుంచి దూరంగా బయటకు వెళ్లిపోతారు. ఇలా కొందరిలో ఒక్కో విధమైన మానసిక రుగ్మత వుంటుందని సైకియాట్రిస్టులు చెపుతుంటారు.
 
ఇపుడు కోలీవుడ్ ఇండస్ట్రీని వణికిస్తున్న ఒకే ఒక్కరు గాయని సుచిత్ర. ఈమె ధనుష్, ఆండ్రియా, అనిరుధ్, సంచితా శెట్టి, త్రిష... తదితరుల ఫోటోలను ట్విట్టర్లో జోడిస్తూ కామెంట్లు పెట్టి రచ్చరచ్చ చేసేసింది. దీనిపై పెద్ద దుమారం రేగింది. అసలు ఆ ఫోటోలను సుచిత్ర జోడించలేదనీ, ఎవరో ఆమె ఖాతాను హ్యాక్ చేసి పెట్టేశారంటూ సుచిత్ర భర్త వాదించారు. ఐతే ఎవరో... సుచిత్ర ఖాతాలో నుంచి ఇలాంటివి పెట్టాల్సిన అగత్యం ఏంటన్నది ప్రశ్న. ఐతే కొందరు సుచిత్రకు ట్విట్టర్ మేనియా పట్టుకుందనీ, అందువల్ల ఇష్టం వచ్చినట్లు ఏవేవో జోడిస్తోందని మండిపడుతున్నారు. కాగా ఆమెకు చికిత్స ఇప్పించేందుకు విదేశాలకు తీసుకెళుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి అక్కడ కూడా ట్విట్టర్ ను వదిలిపెడుతుందో లేదో చూడాలి.