బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (10:12 IST)

హాకీ ప్లేయర్‌గా ఢిల్లీ బ్యూటీ..

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు సినిమా టేకింగ్‌పై సంచలన విమర్శలు చేసిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ. ఈమె తాజాగా నటించిన 'ఆనందో బ్రహ్మా'. ఈ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుణ్ దా

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు సినిమా టేకింగ్‌పై సంచలన విమర్శలు చేసిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ. ఈమె తాజాగా నటించిన 'ఆనందో బ్రహ్మా'. ఈ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుణ్ దావన్ సరసన హీరోయిన్‌గా నటించిన "జుడ్వా 2" రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఇంతలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పింది. 
 
ఇప్పటికే 'పింక్', 'బేబి' వంటి సినిమాలతో బాలీవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న తాప్సీ, తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో హాకీ ప్లేయర్‌గా నటించనుందట. ఈ చిత్రానికి హాకీ మాజీ ఆటగాడు సందీప్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనుంది. అందుకోసం ప్రత్యేకంగా హాకీ శిక్షణ తీసుకునేందుకు రెఢీ అవుతోంది. షాద్ అలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.