శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 12 అక్టోబరు 2017 (21:56 IST)

అలా జరిగి సర్వం కోల్పోయాను- మిల్కీ బ్యూటీ తమన్నా

చాలామంది హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదిస్తున్నా వారికి తీరని కోర్కెలు చాలానే ఉంటాయి. యవ్వన దశలోనే హీరోయిన్లు అయిపోయి ఎప్పుడూ కెమెరాల ముందే బిజీగా గడుపుతూ నిజ జీవితంలో అనుభవించాల్సినవన్నీ పోగొట్టుకుంటుంటారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిన

చాలామంది హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదిస్తున్నా వారికి తీరని కోర్కెలు చాలానే ఉంటాయి. యవ్వన దశలోనే హీరోయిన్లు అయిపోయి ఎప్పుడూ కెమెరాల ముందే బిజీగా గడుపుతూ నిజ జీవితంలో అనుభవించాల్సినవన్నీ పోగొట్టుకుంటుంటారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. 17 సంవత్సరాలకే సినిమాల్లోకి వచ్చిన తాను సర్వం కోల్పోయానని చెబుతోంది.
 
ఆ వయస్సులో ఎన్నో చేయాలనుంటుంది. స్నేహితులతో ఎంజాయ్ చేయడం, ఇష్టమైన ప్రాంతాలను తిరగడం ఇలాంటివి చేయాలని ఉంటుంది. కానీ కెమెరా ముందుకు వచ్చిన తరువాత అవన్నీ చేయలేకపోయాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్‌లో బిజీగా ఉంటాను. రాత్రికి ఇంటికి వెళ్ళిపోతుంటాను. ఇక ఏముంది. అంతా కోల్పోయినట్లేనని చెబుతోందట. ఇప్పటికే మిల్కీ బ్యూటీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా స్నేహితులతో ఇలా చెప్పిందట.