ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2017 (15:56 IST)

నమితను ముచ్చటగా మూడోసారి పెళ్లాడనున్న శరత్ బాబు...

అందాలతారగా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ నమిత. తెలుగులో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో కోలీవుడ్ వైపు మళ్లింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించి బొద్దుగా మారిన నమితకు మెల్లమెల

అందాలతారగా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ నమిత. తెలుగులో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో కోలీవుడ్ వైపు మళ్లింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించి బొద్దుగా మారిన నమితకు మెల్లమెల్లగా ఛాన్సులు కరువైనాయి.

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నాజూకుగా ఉన్న హీరోయిన్ నమిత... ఆ తర్వాత క్రమంగా బొద్దుగా తయారైంది. సినిమా అవకాశాల్లేక రాజకీయాల్లోకి రావడంపై నమిత దృష్టి సారింది. నమిత రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని పక్కనబెడితే.. ప్రస్తుతం ఈ బొద్దుగుమ్మ వృద్ధ నటుడిని ప్రేమిస్తుందని టాక్. 
 
సీనియర్ నటుడు శరత్ బాబుతో నమిత ప్రేమ వ్యవహారం నడుపుతోందని కోలీవుడ్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్త ఆమె ఫ్యాన్స్‌కు ఇబ్బంది పెట్టినా.. నమిత మాత్రం శరత్ బాబును త్వరలో పెళ్లి చేసుకోబోతుందని టాక్. 
 
ఈ మధ్య కాలంలో శరత్ బాబు చేసిన ఓ కామెంట్ కూడా దీనికి బలం చేకూరుస్తోంది. తన రెండు పెళ్లిళ్లు పెటాకులైపోయాయని... ఇప్పుడు తాజాగా, ముచ్చటగా మూడోసారి ఓ హీరోయిన్‌తో బంధాన్ని కొనసాగిస్తున్నానని చెప్పారు. దీంతో ఆ హీరోయిన్ ఇంకెవ్వరూ కాదు.. నమితనేనంటూ.. తమిళ సినీ జనం ఫిక్స్ అయిపోయాయి. మరి దీనిపై నమిత ఏమంటుందో వేచి చూడాలి.