1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2016 (10:05 IST)

మొన్న సెంథిల్.. నిన్న గౌండమణి.. నేను చనిపోలేదు.. బతికే వున్నానంటూ ప్రకటన

తమిళంలో ప్రముఖ కమెడియన్ గౌండమణి మరణించినట్టు అంతటా వార్తలు గుప్పుమన్నాయి. అయితే వార్తల్లో నిజం లేదని తేలింది. ఆయనకు శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అయితే

తమిళంలో ప్రముఖ కమెడియన్ గౌండమణి మరణించినట్టు అంతటా వార్తలు గుప్పుమన్నాయి. అయితే వార్తల్లో నిజం లేదని తేలింది.  ఆయనకు శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఈ లోగా గౌండమణి తీవ్రమైన గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్టు సామాజిక మాధ్యమాలలో వార్తలు వచ్చాయి. అంతేగాక వికీ పేజీలో సైతం ఈ మరణ వార్తను నమోదు చేసారు. 
 
దాంతో ఆయన అభిమానులు ఉలిక్కిపడి పత్రికా కార్యాలయాలకు, గౌండమణి సంబంధీకులకు ఫోన్లు చేయసాగారు. దాంతో మీడియావారు నాలుక్కరుచుకుని... ఆయన మరణించారనే వార్తలు కేవలం రూమర్స్ అనీ, ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారనీ  ప్రకటన చేసారు. గౌండమణి మరణించినట్టు సామాజిక మాధ్యమాలలో వచ్చిన పోస్ట్‌ను కూడా తొలగించారు. 
 
ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన తన ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తున్న వ్యక్తి ఎవరో తనకు తెలియదని, ఈ ప్రచారం వల్ల అతడికి కలిగే ప్రయోజనం ఏమిటో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. తన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం కథా చర్చల్లోనూ పాల్గొంటున్నానని ఈ హీరో పేర్కొన్నారు. తన తాజా చిత్రం ప్రారంభం సందర్భంగా మీడియా ముందుకు వస్తానని ఆయన తెలిపారు.