సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (11:25 IST)

మా పెళ్లి హైదరాబాదులో జరుగదు... విదేశాల్లోనే జరుగుతుంది.. వరుణ్ తేజ్

Varun Tej, Lavanya Tripathi
మెగా వరుణ్ తేజ్ వివాహం హైదరాబాదులో జరిగేలా లేదు. వారి వివాహం విదేశాల్లో జరిగే అవకాశం వుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వర్తాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని వరుణ్ కూడా ధ్రువీకరించాడు. ఈ ఏడాది నవంబరు, లేదా డిసెంబరులో తమ పెళ్లి ఉండొచ్చని వరుణ్ చెప్పుకొచ్చాడు. మెగా హీరో వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠీల వివాహం త్వరలో జరగనుంది. 
 
ఇటీవలే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. తమ పెళ్లి హైదరాబాదులో జరిగే అవకాశాలు లేవన్నారు. ఇది పూర్తిగా ప్రైవేట్‌గా జరుగుతుందని చెప్పుకొచ్చారు.
 
డెస్టినేషన్ వెడ్డింగ్‌లా తమ పెళ్లి జరుగుతుందని చెప్పారు. వాస్తవానికి హైదరాబాదులో పెళ్లి చేసుకోవడమే తనకు ఇష్టమని, కానీ పరిస్థితుల కారణంగా హైదరాబాదులో పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కుదిరితే విదేశాల్లో వివాహం చేసుకునే ఆలోచన కూడా ఉందని వరుణ్ తేజ్ పేర్కొన్నారు. మనదేశంలోని మూడు ప్రాంతాలు, ఫారెన్ లో రెండు ప్రాంతాలు పెళ్లి కోసం పరిశీలిస్తున్నామని తెలిపారు.