గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2023 (15:10 IST)

"భోళాశంకర్" రెమ్యునరేషన్‌ను వెనక్కి ఇచ్చేసిన చిరంజీవి?

bholashankar chiru
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "భోళాశంకర్". ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక చతికిలపడింది. ఈ కారణంగా చిత్ర నిర్మాతకు భారీ నష్టాలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ కోసం తీసుకున్న రెమ్యునరేషన్‌ను తిరిగి ఇచ్చేసినట్టు ఓ వార్త టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. 
 
సంక్రాంతికి వచ్చిన "వాల్తేరు వీరయ్య"కు చిరంజీవి రూ.50 కోట్లు పారితోషికం తీసుకోగా, "భోళాశంకర్"కు రూ.60 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ఈ మొత్తాన్ని సినిమా విడుదలకు ముందే చిరంజీవికి నిర్మాత అనిల్ సుంకర ఇచ్చారట. అయితే, ఈ చిత్రం విడుదలైన తర్వాత చిత్రం నిరాశపరచడంతో చిరంజీవి రూ.10 కోట్ల చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేయకుండా నిర్మాతకు తిరిగి పంపించినట్టు టాలీవుడ్ వర్గాల సమాచార. ఇదిలావుంటే, ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయగా, చిరంజీవి జాకీష్రాఫ్ డబ్బింగ్ చెప్పారు. ఈ నెల 15వ తేదీన హిందీ వెర్షన్ విడుదల కానుంది.