ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2023 (11:12 IST)

మెగాస్టార్‌ విదేశాల్లో సర్జరీ... ఎందుకో తెలుసా?

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి మోకాలికి సర్జరీ చేయించుకోనున్నారు. ఈ ఆపరేషన్ ఢిల్లీ లేదా బెంగుళూరు లేదా హైదరాబాద్ నగరాలు లాదే విదేశాల్లో జరిగే అవకాశం ఉంది. ఈ సర్జరీ జరిగే ప్రాంతంలో ఓ క్లారిటీ రావాల్సివుంది. వైద్యుల సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రం ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడదలైంది. అయితే, ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఇది మెగా అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. 
 
ఈ నేపథ్యంలో చిరంజీవికి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న చిరంజీవి ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. సర్జరీ చేయించుకోవాలని చిరంజీవి డాక్టర్లు సూచించారని, దీంతో ఆయన ఆపరేషన్ చేయించుకోవడానికి రెడీ అవుతారని టాక్. ఈ సర్జరీ హైదరాబాద్ లేదా విదేశాల్లో సర్జరీ జరిగే అవకాశం ఉంది. అయితే, ఈ సర్జరీ చేసిన తర్వాత చిరంజీవి కనీసం మూడు నెలలో పాటు ఇంటికే పరిమితం కావాల్సివుంటుందని వైద్యులు అంటున్నారు.