శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 17 మే 2018 (14:19 IST)

విదేశాల్లో వెడ్డింగ్ షాపింగ్.. త్రిష త్వరలో పెళ్లి కూతురు కానుందా?

త్రిష త్వరలో పెళ్లి కూతురు కానుందా? అంటే కోలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. గతంలో త్రిష పెళ్లి.. నిశ్చితార్థంతో ఆగిపోయింది. ఆపై సినిమాలపై త్రిష దృష్టి పెట్టినా.. పెద్దగా అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు.

త్రిష త్వరలో పెళ్లి కూతురు కానుందా? అంటే కోలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. గతంలో త్రిష పెళ్లి.. నిశ్చితార్థంతో ఆగిపోయింది. ఆపై సినిమాలపై త్రిష దృష్టి పెట్టినా.. పెద్దగా అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. కానీ తమిళ సినిమాల్లో నటించిన త్రిష... త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.
 
ఇటీవల స్నేహితులతో కలిసి త్రిష విదేశాలకి వెళ్లి వచ్చింది. అక్కడ భారీస్థాయిలో షాపింగ్ చేసింది. ఇది కచ్చితంగా అది వెడ్డింగ్ షాపింగేనని సమాచారం. త్రిష కొంతకాలంగా వ్యాపారవేత్తతో చనువుగా వుంటున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. 
 
అంతేగాకుండా చేతిలో వున్న సినిమాలను పూర్తి చేశాక.. త్రిష పెళ్లిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. అప్పటిదాక త్రిషను మనువాడే ఆ వరుడెవరో చెప్పేందుకు త్రిష నిరాకరిస్తుందని టాక్.