గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 మార్చి 2017 (16:10 IST)

ఆ విషయంలో జోక్యం చేసుకోను.. అంతా అతనిష్టమే : నాగార్జున

టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని, డిజైనర్ శ్రియా భూపాల్ రెడ్డి పెళ్లి రద్దు అయినట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ అంశంపై హీరో నాగార్జున ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఈ విషయంలో నాగార్జున స్ట

టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని, డిజైనర్ శ్రియా భూపాల్ రెడ్డి పెళ్లి రద్దు అయినట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ అంశంపై హీరో నాగార్జున ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఈ విషయంలో నాగార్జున స్టేట్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ ఆత్రుతతగా ఎదురు చూస్తున్నారు. 
 
మరోవైపు.. అఖిల్ రెండో సినిమాతో పక్కాగా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. వినాయక్ డైరెక్షన్‌లో కమర్షియల్ ఫార్ములాతో వచ్చినా ప్రేక్షకులు ఆదరించకపోవడంతో డైరెక్టర్ విక్రమ్‌ కుమార్‌‌తో అఖిల్ రెండో సినిమాకు రెడీ అయ్యాడు. 
 
విక్రమ్ కుమార్ సినిమాలు ఒక్కొక్కటి విభిన్న కథాంశంతో రూపొందినవే. 'ఇష్క్', 'మనం', '24' ఇలా వేటికవే డిఫరెంట్. 'మనం' సినిమా నాగార్జున కెరీర్‌లో ఓ మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చింది. తండ్రికి హిట్ ఇచ్చిన దర్శకుడే తనకూ హిట్ సినిమాను అందిస్తాడనే నమ్మకంతో అఖిల్ ఉన్నాడు.
 
అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అఖిల్ సినిమా తర్వాత నాగార్జున, అఖిల్ రెండో సినిమా విషయంలో తర్జనభర్జన పడ్డారట. ఎంతో డైలమా తర్వాత విక్రమ్‌ చెప్పిన కథకు ఓకే చెప్పారట. ఈ సినిమాను తెరకెక్కించే విషయంలో దర్శకుడికి పూర్తి స్వేచ్చనిచ్చారట. 
 
తాను గానీ, అఖిల్ గానీ సినిమా కథ విషయంలో జోక్యం చేసుకోమని నాగార్జున విక్రమ్‌కు తేల్చి చెప్పాడట. ఏం చేస్తావో, ఎలా తీస్తావో తెలియదు గానీ ఈ సినిమా హిట్టవ్వాలని నాగార్జున విక్రమ్‌కు చెప్పాడట. దొరకాల్సినంత ఫ్రీడమ్ దొరికింది... మరి దర్శకుడి కథ, పనితనంపైనే అఖిల్ రెండో సినిమా హిట్టో, ఫట్టో తేలనుంది.