కోర్టు తీర్పు వచ్చినా శంకర్ సినిమాను ఆసక్తిగా తీస్తాడా?
కమల్ హాసన్, శంకర్ కలయికలో రూపొందుతున్న `ఇండియన్2` (తెలుగులో భారతీయుడు2) సినిమా వివాదం సమసిపోయేట్లు లేదు. చిత్ర నిర్మాణ సంస్థ లైకాకూ శంకర్ కు మధ్య విభేదాలు తలెత్తడంతో వాటిని పరిష్కరించే బాధ్యతను కమల్ తీసుకున్నారు. కానీ చర్చలు సఫలం కాలేదు. అయితే అసలు ఆలస్యం కావడానికి కమల్, లైకా సంస్థే కారణమంటూ శంకర్ మద్రాస్ హై కోర్టులో కేసు వేశాడు.ఈ పరిణామానికి లైకా సంస్థ అనుకోని రీతిలో స్పందించింది. తెలుగు ఛాంబర్ కి, బాలీవుడ్ ఫిలిమ్ ఛాంబర్ కు లైకా శంకర్ మీద ఫిర్యాదు చేస్తూ లెటర్స్ పంపిందట. తమ సినిమా పూర్తి చేయకుండా మధ్యంతరంగా వదిలేసి రామ్‌చరణ్ సినిమా చేస్తున్నాడంటూ అలాగే బాలీవుడ్‌లో రణ్ వీర్ సింగ్ హీరోగా అన్నియన్ ను రీమేక్ చేయబోతున్నాడంటూ పేర్కొంది.
కాగా, మద్రాస్ హైకోర్టులో వేసిన శంకర్ కేసు జూన్ 4న హియరింగ్ కి రానుంది. ఆ తర్వాత లైకా ఫిర్యాదుకు టాలీవుడ్, బాలీవుడ్ ఛాంబర్స్ ఎలా స్పందించనున్నాయనేది వేచి చూడాల్సిందే. సామరస్యంగా సాగాలనుకున్న ఈ చిత్రం ఇంత వివాదం మధ్యన ఒకవేళ షూటింగ్ చేయాలని తీర్పు వస్తే శంకర్ గతంలో వున్న శ్రద్ధాశక్తులతో చేస్తాడోలేడో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.