మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 11 మే 2021 (15:37 IST)

ప‌వ‌న్ బాట‌లో క‌మ‌ల్ అడుగులు

Kamal-pvan
ప‌వ‌న్ క‌ళ్యాన్‌కూ క‌మ‌ల్ హాస‌న్‌కూ ఓ విష‌యంలో పోలిక‌వుంది. త‌ను రాజ‌కీయ‌పార్టీ పెట్టాల‌నుకున్న స‌మ‌యంలో 2018లోనే చెన్నై వ‌చ్చిన ప‌వ‌న్‌తో క‌మ‌ల్ భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత ప‌రిణామాల‌వ‌ల్ల ఇరువురూ రాజ‌కీయ పార్టీలు పెట్టారు. ఇద్ద‌రూ రాజ‌కీయ పార్టీ పెట్టి ఓడిపోయిన వారే. 2019లో జ‌రిగిన ఫ‌లితాల కార‌ణంగా ఆంధ్ర రాజ‌కీయాల వ‌ల్ల అల‌సిపోయిన వ‌ప‌న్ మ‌ర‌లా సినిమాల‌వైపు దృష్టి పెట్టాడు. అదేమంటే. పార్టీని న‌డిపించాలంటే డ‌బ్బులు కావాలి క‌దా అన్నాడు. ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్ ప‌రిస్థితి అలానే వుంది. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో నిల‌బ‌డి భంగ‌ప‌డ్డాడు. అందుకే ఇప్ప‌టికైనా సినిమాల‌వైపు దృష్టిపెట్టాడు. అందులోనూ రెండు సినిమాలు సగంపైగా పూర్త‌య్యాయి. వాటిని కంప్లీట్ చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్నాడు.
 
భార‌తీయుడు సినిమా 30 ఏళ్ళ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో క‌మ‌ల్ హాస‌న్ చ‌ర్చ‌లు జ‌రిపాడ‌ని టాక్ నెల‌కొంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా ఇండియ‌న్‌^2 త‌మిళంలో, భార‌తీయుడు2 తెలుగులో చేస్తున్నారు. లైకా సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను చేసింది. అయితే ర‌క‌ర‌కాల కార‌ణాల‌వ‌ల్ల ఆ సినిమా ముప్పావు వంతు పూర్త‌య్యాక అట‌కెక్కింది. అందుకే లైకా సంస్థ ఈ విష‌యాన్ని క‌మ‌ల్‌తో ప్ర‌స్తావించినట్లు తెలిసింది. ఇందుకు శంక‌ర్‌ను ఒప్పించే బాధ్య‌త‌ను క‌మ‌ల్ తీసుకున్నాడ‌ని సినీవ‌ర్గాలు తెలుపుతున్నాయి.
 
లంచ‌కొండిత‌నం, అవినీతి పై భార‌తీయుడు ఏ విధంగా పోరాడాడు అన్న‌ది మొద‌టి భాగ‌మైతే రెండో భాగంలో ఇప్ప‌టి టెక్నాల‌జీని కూడా అందులో చూపిస్తూ స‌రికొత్త క‌థ‌గా మ‌లిచార‌ని తెలిసింది. అదేకాకుండా `శ‌భాష్ నాయుడు` అనే సినిమాను కూడా పూర్తి చేసే ప్లాన్‌లో వున్నాడ‌ని స‌మాచారం. ఇవికాకుండా మ‌రో రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఈ రెండు సినిమాల‌కు త‌న టీమ్ లోని కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్నార‌ట‌. మ‌రి 2022లో క‌మ‌ల్ జోష్ ఏ రేంజ్‌లో వుంటుందో చూడాలి.