మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 మే 2021 (12:23 IST)

వరుస సినిమాలతో పవన్ కల్యాణ్ బిజీ బిజీ.. రవితేజ దర్శకుడితో..?

రవితేజ దర్శకుడితో పవన్ కళ్యాణ్ మూవీకి రంగం సిద్ధమవుతుందనే టాక్ వినిపిస్తోంది. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'వకీల్ సాబ్' మూవీతో పలకరించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కొన్ని చోట్ల నష్టాలను చవిచూసింది. 
 
అంతేకాదు ఈ సినిమా విడుదలైన మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయింది. అంతేకాదు తెలుగులో దాదాపు 100 మిలియన్ హిట్స్ వచ్చిన మూవీగా రికార్డులు క్రియేట్ చేసినట్టు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. 'వకీల్ సాబ్' లో పవన్ కళ్యాణ్ లాయర్ సత్యదేవ్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. 
 
ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీర మల్లు' మూవీ చేస్తున్నాడు. దాంతో పాటు మలయాళంలో హిట్టైన 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. మల్లూవుడ్‌లో బిజూ మీనన్, పృథ్వీరాజ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బిజూ మీనన్ పాత్రలో నటిస్తుండగా.. రానా దగ్గుబాటి పృథ్వీరాజ్ పాత్రలో నటిస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా నిత్యా మీనన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు.
 
దీంతో పాటు పవన్ కళ్యాణ్.. క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలతో పాటు బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. ఈ కోవలో పవన్ కళ్యాణ్ మరో క్రేజీ దర్శకుడు చెప్పిన కథకు ఒకే చెప్పినట్టు సమాచారం. 
 
బెల్లంకొండ శ్రీనివాస్‌తో 'రాక్షసుడు' సినిమాను తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కే అవకాశాలున్నాయి.
 
ప్రస్తుతం రమేష్ వర్మ.. రవితేజ హీరోగా 'ఖిలాడీ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కానీకొచ్చింది. మరోవైపు పవన్ కళ్యాణ్.. 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌లో నటిస్తున్నారు.
 
ఈ సినిమా తర్వాత క్రిష్, హరీష్ శంకర్ సినిమాలున్నాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రమేష్ వర్మ చిత్రం తెరకెక్కే అవకాశం ఉంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ నెలలోనే ప్రారంభించి అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు సమాచారం.