శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (14:23 IST)

క్రాక్ నుంచి భలేగా తగిలావే బంగారం.. వచ్చేస్తోంది..

మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం "క్రాక్". గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. 
 
సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ - సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయనున్నారు.
 
తాజాగా 'క్రాక్' నుంచి మరో సాంగ్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. 'భలేగా తగిలావే బంగారం..' అనే సాంగ్‌ని డిసెంబర్ 13న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ స్వరపరిచిన ఈ పాటను యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాడటం విశేషం. ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కలిపి ఓ పాట చేయడంతో 'భలేగా తగిలావే బంగారం' సాంగ్ పై అంచనాలు పెరిగాయి. ఈ సాంగ్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.