శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (20:52 IST)

కొత్తొక వింత.. పాతొక రోత.. గుప్పెడంత మనసు నటి అరెస్ట్.. మాజీ ప్రియుడిని..?

Guppedantha Manasu
Guppedantha Manasu
ప్రియుడితో కలిసి మాజీ లవర్‏పై 'గుప్పెడంత మనసు' సీరియల్ నటి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాదులో కలకలం రేపుతోంది. ఈ ఘటనలో బాధితుడి పరిస్థితి విషమంగా వుంది. వివరాల్లోకి వెళితే.. సీరియల్ నటి నాగవర్ధిని సూర్యనారాయణ ఒకప్పుడు ప్రేమికులు. 
 
ఇద్దరూ కృష్ణానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సహజీవనం కూడా చేస్తున్నారు. ఒకరోజు సూర్యనారాయణ తన స్నేహితుడు శ్రీనివాస్‌ రెడ్డిని నాగవర్థినికి పరిచయం చేశాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో సూర్యనారాయణకు ఆమె దూరమైంది. 
 
ఈ బ్రేకప్‌ తర్వాత శ్రీనివాస్‌, నాగవర్థిని కలిసి అదే ఇంట్లో సహజీవనం చేస్తూ వచ్చారు. సూర్యనారాయణ అదే బిల్డింగ్‌లోని పై ఫ్లోర్‌కి మారాడు. తాజాగా సూర్యనారాయణకు, ఈ జంటకు మధ్య వివాదం తలెత్తింది. ఆ వివాదం కాస్తా ముదిరి.. ఆ జంట ఇద్దరూ కలిసి సూర్యనారాయణనను బిల్డింగ్ పైనుంచి తోసేశారు. 
 
స్థానికుల సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. సూర్యనారాయణను పంజాగుట్టలోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు నాగవర్ధిని, శ్రీనును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాగవర్ధికి గతంలో వివాహమైనట్లు పోలీసులు గుర్తించారు.