శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (11:13 IST)

మద్యం సేవించి లహరి కారు నడపలేదు-పోలీసులు

Lahari
శంషాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదానికి సీరియల్ నటి లహరి కారణమని తేలింది. మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసి ఉంటుందని అనుమానించిన పోలీసులు లహరిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా మద్యం సేవించలేదని తేలింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేటు పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి డ్యూటీ ముగించుకుని శంషాబాద్ వైపు బైక్‌పై వస్తుండగా వెనకాల నుంచి మారుతి సియాజ్ కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కిందపడి గాయపడ్డాడు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని కారును చుట్టుముట్టారు. 
 
కారును డ్రైవ్ చేస్తున్న మహిళను కిందికి దిగాలంటూ హడావుడి చేశారు. కారు డ్రైవింగ్ చేసిన మహిళను సీరియల్ నటి లహరిగా గుర్తించడంతో అక్కడున్న వారందరూ షాకయ్యారు. దీనిపై పోలీసులు జరిపిన దర్యాప్తులో లహరి మద్యం తాగి యాక్సిడెంట్ చేయలేదని తేలింది.