ఆరేళ్ళ చిన్నారి చైత్ర కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్
హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల గిరిజన బాలిక బలైపోయిన సంగతి తెలిసిందే. దీంతో మాములు ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ దాడికి పాల్పడిన నిందితుడి పై తీవ్ర స్థాయి లో మండి పడుతున్నారు. అంతేకాదు సినిమా స్టార్లు కూడా ఈ ఘటనపై స్పందిస్తున్నారు.
ఇప్పటికే హీరో మంచు మనోజు ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ఆరేళ్ళ చిన్నారి చైత్ర కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
తన తోటి గ్రేటర్ కమిటీ సభ్యులు మరియు జనసేన శ్రేణులు అందరూ రావాల్సిందిగా కూడా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. మరికొద్ది సేపట్లో జూబ్లీహిల్స్ కేంద్ర కార్యాలయం నుండి.. సింగరేణి కాలనీకి బయలు దేరునున్నారు పవన్ కళ్యాణ్.