గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (13:05 IST)

సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం - ఆరేళ్ల పాల అత్యాచారం

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌లో దారుణం జరిగింది. ఈ ప్రాంతంలోని సింగరేణికాలనీలో ఆరేళ్ల పాప దారుణహత్యకు గురైంది. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడో దుర్మార్గుడు. ఈ ఘటనతో బస్తీవాసులు ఉలిక్కిపడ్డారు. నిందితుడిని తమకు అప్పగించాలని రాత్రంతా ఆందోళనకు దిగారు.
 
గురువారం సాయంత్రం 5 గంటల నుంచి బాలిక కనిపించకపోవడంతో స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులంతా గాలించారు. కానీ, ఎక్కడా కనిపించలేదు. దీంతో అయితే పాప ఇంటికి సమీపంలోనే ఉండే రాజుపై అనుమానం వచ్చి అతని ఇంటికి వెళ్లారు. 
 
కానీ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో తాళం బద్దలు కొట్టి మరీ పాప కోసం గాలించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్థానికులు.. రాజు ఇంట్లో చిన్నారి కనిపించిన దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. పాప విగతజీవిగా కనిపించడంతో అంతా కన్నీటిపర్యంతమయ్యారు.
 
జులాయిగా తిరిగే బాలరాజు... దొంగతనాలు చేస్తూ దుర్వ్యసనాలకు బానిసై నిత్యం భార్యను తరచూ కొట్టేవాడు. నిత్యం కొడుతూ భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. ఒంటరిగా ఉండే అతగాడు.. సైకో చేష్టలపై అనుమానంతో వెళ్లి చూస్తే పాప మృతదేహం కనిపించడంతో మృతురాలి కుటుంబ సభ్యులు, సింగరేణికాలనీ వాసులు రగిలిపోయారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, చిన్నారి మృతదేహాన్ని తమకు ప్పగించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తూ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.