గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (12:01 IST)

ఈడీ విచారణకు హాజరైన మాస్ రాజా: రవితేజ డ్రైవరే కీలక సూత్రధారి

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక్కో సినీ తార ఈడీ విచారణకు హజరవుతున్న నేపథ్యంలో ఒక్క కోణం బయట పడుతోంది. అయితే.. ఇవాళ ఈ డ్రగ్స్ కేసులో రవితేజ విచారణ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే… డ్రగ్స్ కేసులో కీలకంగా మారాడు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్. ఎక్సైజ్ కేసులో ముందుగా శ్రీనివాస్ ని పట్టుకున్న అధికారులు.. శ్రీనివాసుని పట్టుకోవడంతో బయటపడ్డాయి టాలీవుడ్ డ్రగ్స్ లింక్స్.
 
శ్రీనివాస్ ద్వారా కెల్విన్ ను ఎక్సైజ్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం పట్టుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్, కెల్విన్ విచారించినప్పుడు టాలీవుడ్‌ స్టార్ల డ్రగ్స్ నిర్వహాం బయటపడింది.. డ్రగ్స్ లింక్స్ బయటపడడంతో టాలీవుడ్‌ స్టార్లకు నోటీసులు ఇచ్చారు.
 
ఇక ఇప్పుడు ఈడీ దర్యాప్తు లో కూడా శ్రీనివాస కీలకoగా మారాడు. శ్రీనివాస్, కెల్విన్ , ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్ల బ్యాంకు లావాదేవీల కీలకంగా మారింది. శ్రీనివాస ద్వారా టాలీవుడ్ కు డ్రక్స్ సరఫరా అయినట్లు గా గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలోనే బ్యాంకు అకౌంట్లో స్టేట్మెంట్‌ను ఈడి అధికారులకు ఇచ్చారు రవితేజ మరియు శ్రీనివాస్. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు ఈడీ అధికారులు.