గురువారం, 28 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : శనివారం, 9 జనవరి 2021 (12:50 IST)

1995 వైశాల్యపురంలో ''ఊర్వశి''

1995 Vaishalyapuramlo Oorvasi
ఎస్వీ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై నిర్మాతలు టి.వేణుగోపాల్, సతీష్ నిర్మిస్తున్న చిత్రం ‘1995 వైశాల్యపురంలో ఊర్వశి’. గోవింద్ శర్మన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ లో  పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బండి శ్రీనివాస్ సహకారంతో రూపొందిస్తున్న ఈమూవీలో శుక్రాంత్, అను వర్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. 
 
నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు. సి.కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ప్రసన్న కుమార్ రెడ్డి గౌరవదర్శకత్వం వహించారు. సి.కళ్యాణ్​ మాట్లాడుతూ..‘ముందుగా అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త టీమ్ తో మొదలైన ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా’అన్నారు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ..‘ఊర్వశి సినిమాని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి మేం ఎప్పుడూ ముందుంటాం. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’అన్నారు. 
 
ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ..‘వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుందనుకుంటున్నా. చిత్రయూనిట్ అంతా తపనతో పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది టీమ్ అంతటికీ ఆల్‌ ద బెస్ట్’చెప్పారు. దర్శకుడు గోవింద్ మాట్లాడుతూ..‘మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు. 
 
శుక్రాంత్ కి కథ చెప్పగానే నన్ను నమ్మి ఓకే చెప్పారు. విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ లవ్ స్టోరీతో పీరియాడికల్ డ్రామాగా రూపొందిస్తున్నాం. నాకు దర్శకుడిగా చాన్స్ ఇచ్చిన నిర్మాతకు బుణపడి ఉంటాను. డైలాగ్ రైటర్ మధుబాబుకి ధన్యవాదాలు’అన్నారు.   హీరో శుక్రాంత్ మాట్లాడుతూ‘గోవింద్ నాకు స్టోరీ చెప్పినప్పుడే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. ప్రస్తుతం కనబడుటలేదు మూవీలో నటిస్తున్నాను. త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఊర్వశి  నాకు గుర్తిండిపోయే సినిమా అవుతుంది’అన్నాడు.   
 
హీరోయిన్ అనువర్ణ మాట్లాడుతూ..‘మమ్మల్ని  ఎంకరేజ్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. మంచి మూవీతో మీ ముందుకు వస్తున్నాం’అంది హీరోయిన్ అనువర్ణ. మ్యూజిక్ డైరెక్టర్ నందన్, ఎడిటర్ వైఆర్ శేఖర్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా శ్రీపతి బండి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు