బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

'గ్రామీ 2024' అవార్డు వెల్లడి ... మైఖేల్‌కు ఉత్తమ రాప్ ఆల్బమ్ అవార్డు

trevor noah
అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో 2024 సంవత్సరానికిగాను 66వ గ్రామీ అవార్డులను ప్రకటించారు. ఈ వేడుక ఎంతో సందడిగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక మ్యూజిక్ అవార్డు షోకు ట్రెవర్ నోహ్ హోస్ట్‌గా వ్యవహరించారు. పలువురు అగ్ర కళాకారులు వేదికపై లైవ్ ఫెర్మార్మెన్స్‌ చేసి అదరగొట్టారు. విజేతల జాబితా ప్రకటించగానే అరుపులు, కేకలతో వేదిక హోరెత్తింది. విజేతలు ఒక్కరుగా అవార్డులను అందుకున్నారు. గ్రామీ 2024 అవార్డుల విజేతల వివరాలను పరిశీలిస్తే, 
 
ర్యాప్ ఆల్బమ్ అవార్డును మైఖేల్ (కిల్లర్ మైక్) దక్కించుకున్నారు. అలాగే, ఉత్తమ ఆఫ్రికన్ సంగీత ప్రదర్శన అవార్డును టైలా (వాటర్), పాప్ డ్యుయో లేదా గ్రూపు ప్రదర్శన అవార్డును ఎస్‌జెడ్ఏ, ఫోబి బ్రిడ్జర్స్, (ఘోస్ట్ ఇన్ ద్ మెషిన్), మ్యూజిక్ వీడియో అవార్డుు ది బీటిల్స్, జోనథన్ క్లైడ్, ఎం కూపర్ (ఐయామ్ ఓన్లీ స్లీపింగ్), ఉత్తమ పాప్ సోలో ప్రదర్శన అవార్డును మైలీ సైరస్ (ఫ్లవర్స్) ఉత్తమ జాజ్ ప్రదర్శన అవార్డును సమారా జాయ్ (టైట్), కంపోజిషన్ అవార్డును మాంట్ గోమెరి (రౌండ్స్), ఉత్తమ గేయ రచయిత, నాన్ క్లాసికల్ అవార్డును థిరాన్ థామస్‌లు దక్కించుకున్నారు.