ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 20 సెప్టెంబరు 2023 (18:49 IST)

16వ గ్లోబల్ టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్: విజేతలలో విశాఖపట్నం కళాకారిణి కుమారి శృతి మనోజ్ఞ వేమూరి

image
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ప్రతిష్టాత్మకమైన 16వ గ్లోబల్ టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ (TDCAC) విజేతలలో ఒకరిగా విశాఖపట్నంకు  చెందిన యువ కళాకారిణి కుమారి శృతి మనోజ్ఞ వేమూరిని సత్కరించింది. 90 దేశాలు, ప్రాంతాల నుండి 7,80,000 మంది పాల్గొన్న ఈ పోటీలో   "టొయోటా టైమ్ ట్రాన్సిటర్" పేరుతో శృతి గీచిన చిత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఆమె సాధించిన అసాధారణ విజయానికి గుర్తింపుగా 12-15 సంవత్సరాల వయస్సు విభాగంలో 3000 USD ప్రైజ్ మనీని గెలుచుకుంది. ఆమె విశాఖపట్నంలోని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ విద్యార్థిని. 
 
16వ టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ కోసం అధికారిక అవార్డు ప్రదానోత్సవం బెంగళూరు సమీపంలోని బిడాడిలోని TKM ప్లాంట్‌లో జరిగింది. టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌ను జపాన్‌లో టొయోటా మోటార్ కార్పొరేషన్ (TMC) నిర్వహించింది, ఇది 15 సంవత్సరాల వయస్సులోపు పిల్లలను వారి డ్రీమ్ కార్లను గీయడం ద్వారా వారి ఊహ మరియు సృజనాత్మకతను ప్రదర్శించడానికి ప్రోత్సహించే అంతర్జాతీయ కార్యక్రమం. 
 
image
టొయోటా కిర్లోస్కర్ మోటర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ మాట్లాడుతూ, “సాంప్రదాయ విద్య మరియు బోధనాంశాలకు అతీతంగా యువ మనస్సులను పెంపొందించడంలో కళకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ ద్వారా, ఈ యువ మనస్సులలో సృజనాత్మకతను పెంపొందించటం లక్ష్యంగా చేసుకున్నాము. శ్రుతి మనోజ్ఞ వేమూరి వంటి వర్ధమాన కళాకారుల అసాధారణ ప్రతిభకు సాక్షిగా నిలవడం మాకు గర్వకారణం' అని అన్నారు.
 
అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన శృతి మనోజ్ఞ వేమూరి మాట్లాడుతూ “16వ టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌లో విజేతలలో ఒకరిగా గుర్తింపు పొందినందుకు ఆనందంగా వుంది. సృజనాత్మకత మరియు ఆలోచనలను ప్రదర్శించడానికి నాలాంటి యువ కళాకారులకు ఈ అద్భుతమైన వేదికను అందించినందుకు టయోటాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కళాకృతి, 'టయోటా టైమ్ ట్రాన్సిటర్', పర్యావరణ స్పృహపై నా నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది" అని అన్నారు.